మిమ్మల్ని మానసిక సమస్యలు చుట్టుముట్టాయా?

చెప్పుకోవడానికి నా అనేవాళ్ళు లేరు అనుకుంటున్నారా ?

చావు తప్ప వేరేమార్గం లేదని భావిస్తున్నారా ?

అయితే మేమున్నాము అని రోషిని ట్రస్ట్ అంటుంది .

అదేంటో చూద్దాం రండి.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోస్తవం ఐన 10 సెప్టెంబర్  స్పెషల్……

మీరు లేదా మీ కుటుంబ సభ్యులు,బంధువులు,పక్కింటివారు  ,తెలిసినవారెవరైనా  సరే మానసిక సమస్యలతో సతమతమవుతుంటే మరియు మానసిక వైద్యం ఆర్థికంగా భారం అని భావిస్తున్నారా ?

మీ మానసిక సమస్యలు ఎవరితో చెప్పుకోలేక పోతున్నారా ?

అయితే రోషిని ట్రస్ట్ మేమున్నాము అని ముందుకు వచ్చింది,ఆప్యాంగా ఆదరించి మీ సమస్యల గోప్యతలను పాటిస్తూ మీకు కావలసిన వైద్యం అనగా అత్యుత్తమైన వైద్యులచే సంప్రదింపులు,మందులు,కౌన్సిలింగ్,థెరపీ మరియు మానసిక సమస్యల పరీక్షలు పూర్తి ఉచితంగా అందిస్తుంది ఇది పేదవారికి మాత్రమే.

గత 27 సంవత్సరాలుగా సుమారు లక్ష మందికి పైగా వైద్యాన్ని అందించింది.

రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించినమానసిక ఆరోగ్య సేవలు మీ ముంగిటేఅనే కార్యక్రమం ద్వారా రోషిని ట్రస్ట్ వైద్యుల  బృందం నిరుపేదలు నివసిస్తున్న బస్తీలలో భూమిక,మోంటీఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ (MSI ) ఉప్పల్ మరి కొన్ని సంస్థలతో కలిసి వారివద్దకు వెళ్లి వారియొక్క సమస్యలను తెలుసుకుని అవగాహనా సదస్సులను చేపడుతూ  పరిష్కారాలను ఇస్తుంది.అంతే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు,ఇంటర్ మరియు డిగ్రీ కళాశాలలో ఇప్పటివరకు ౩౦౦ లకు పైగా అవగాహనా సదస్సులను చేపట్టి 20 ,000 పైగా పెద్దలకు విద్యార్థులకు మానసిక సమస్యల పట్ల అవగాహనా కల్పించింది.

ప్రభుత్వ జువెనైల్ హామ్స్,స్టేట్ హామ్స్ మరియు ప్రభుత్వం తలపెట్టిన స్కూల్ సేఫ్టీ క్లబ్స్ లో మానసిక సమస్యల అవగాహనా విభాగములో విద్యార్థులకు సేవలుఅందిస్తుంది.

ప్రతి బుధవారం మరియు శుక్రవారం దోమలగూడ లోని రామకృష్ణ మఠములో,ప్రతి ఆదివారము రసూల్పుర లోని KSS చారిటబుల్ లో ,ప్రతి గురువారం బేగంపేట లోని మా ప్రధాన కార్యాలయములో,ప్రతి 3 వ శుక్రవారం ఉప్పల్ లో ని MSI కార్యాలయములో సైకియాట్రిస్ట్,క్లినికల్ సైకాలజిస్ట్ మరియు రెహబ్ సైకాలజిస్ట్ లచే క్యాంపులు నిర్వహిస్తున్నాము,ఈ క్యాంపులలో మందులు,కౌన్సిలింగ్ థెరపీ మరియు పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది.

ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రతి ఒక్కరిని అభ్యర్దిస్తున్నాము.

 Mr. P. Anjankumar

Clinical Psychologist

 

MORE ARTICLES